దేవాదాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు
అసిస్టెంట్ కమిషనర్ గర్భంపై అనుమానం
అమరావతి – ఏపీలో రాజకీయ పరిణామాలు శర వేగంగా మారుతున్నాయి. ఈ తరుణంలో వైసీపీలో చక్రం తిప్పుతూ వచ్చిన రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. విదేశాలలో తాను ఉండగా తన భార్య గర్భం దాల్చిందని, దీనికి ఆయనే కారణం అంటూ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా పని చేసిన శాంతిపై సంచలన ఆరోపణలు చేశారు భర్త మదన్ మోహన్.
ఈ మేరకు తాను విదేశాలలో ఉంటే తన భార్య ఎలా గర్భం దాల్చుతుందని ప్రశ్నించారు. సదరు భార్య నిర్వాకంపై , దానికి కారణమైన ఎంపీ విజయ సాయి రెడ్డిపై విచారణ జరిపించాలని కోరుతూ మదన్ మోహన్ ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం మదన్ మోహన్ భార్య శాంతి దేవాదాయ శాఖ లో అసిస్టెంట్ కమిషనర్ గా పని చేస్తున్నారు.
తన భార్య వివాహేతర సంతానానికి తండ్రి ఎవరో తేల్చాలంటూ లేఖ రాయడం కలకలం రేపుతోంది. తన భార్య గర్భానికి వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డితో పాటు గవర్నమెంట్ ప్లీడర్ సుభాష్ లే కారణమని అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరడం విశేషం.