NATIONALNEWS

దేశం కోసం ఆడ‌డం గ‌ర్వ‌కార‌ణం

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన టెన్నిస్ స్టార్ సానియా

హైద‌రాబాద్ – ప్ర‌పంచ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌వ‌రి 26 శుక్ర‌వారం 75వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు సానియా మీర్జా. ఈ దేశం కోసం ఆడ‌డం ఎల్ల‌ప్ప‌టికీ గ‌ర్వ కార‌ణమేనని పేర్కొన్నారు. భార‌త దేశం త‌ర‌పున అత్యున్న‌త‌మైన క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.

గ‌త ఏడాది టెన్నిస్ రంగం నుంచి నిష్క్ర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. లాల్ బ‌హ‌దూర్ స్టేడియం వేదిక‌గా ఆమెకు అద్భుత‌మైన రీతిలో వీడ్కోలు ప‌లికారు. తాను జీవితంలో మ‌రిచి పోలేని క్ష‌ణం ఏదైనా ఉందంటే మీరంతా త‌న ప‌ట్ల క‌న‌బ‌రుస్తున్న ఆద‌రాభిమానాలేన‌ని పేర్కొన్నారు సానియా మీర్జా.

టెన్నిస్ విభాగంలో ఎన్నో జాతీయ‌, అంత‌ర్జాతీయ టైటిళ్లు సాధించింది. కానీ వివాహ జీవితం మాత్రం కొంత ఇబ్బంది ప‌డేలా చేసింది త‌న‌ను. తాజాగా ప్ర‌ముఖ పాకిస్తాన్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్ బంధం తెగి పోయింది. త‌ను విడాకులు ఇచ్చిన‌ట్లు ప్ర‌క‌టించాడు. దీనిని స్వాగ‌తిస్తున్న‌ట్లు పేర్కొన్నారు సానియా కుటుంబ స‌భ్యులు.

విచిత్రం ఏమిటంటే ప్ర‌ముఖ భార‌తీయ క్రికెట‌ర్ , మాజీ కెప్టెన్ అజ‌హ‌రుద్దీన్ తన‌యుడితో సానియా సోద‌రి పెళ్లి చేసుకుంది.