నియమించిన తెలంగాణ సర్కార్
హైదరాబాద్ – ఎన్నికల ప్రచారంలో తీవ్రమైన ఆరోపణలు చేసిన ధరణి పోర్టల్ కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేరకు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్ ఆదేశాల మేరకు కమిటీని నియమించారు.
ఇందులో సీనియర్ నాయకుడు ఎం. కోదండ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమాండ్ పీటర్ , సీనియర్ న్యాయవాది సునీల్, రిటైర్డ్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ బి. మధుసూదన్ తో పాటు ల్యాండ్ రెవిన్యూ శాఖ కార్యదర్శి సభ్య కార్యదర్శిగా ఉంటారని స్పష్టం చేసింది సర్కార్.
ఇదిలా ఉండగా త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులను గుర్తిస్తామన్నారు. ఒక్కో నియోజకవర్గానికి రూ. 10 కోట్ల ప్రత్యేక అభివృద్ది నిధిని కేటాయిస్తామని చెప్పారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో 17 సీట్లకు గాను కనీసం 15 సీట్లు గెలుపొందాలని స్పష్టం చేశారు. పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు, బాధ్యులు ఆయా నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలను గెలిపించేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఇదిలా ఉండగా ఈనెల 15 నుండి 20 వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళతారని ప్రభుత్వం తెలిపింది. ఆయన ఆరు రోజుల పాటు అక్కడ ఉంటారని వెల్లడించింది.