ధ్యానం జీవన యోగం
ప్రధాన మంత్రి మోదీ
తమిళనాడు – ధ్యానం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. అది జీవితాన్ని మరింత సరళతరం చేస్తుంది. ఈ ప్రయాణంలో ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు, కష్టాలు , సవాళ్లు ఎదురవుతాయి. వాటిని తట్టుకుని నిలిచే శక్తి కేవలం ప్రశాంతమైన మనసు కలిగి ఉండడం వల్లనే సాద్యమవుతుందని నమ్ముతారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
అయోధ్య రామ మందిరం పునః ప్రతిష్టాన కోసం తనను తాను భక్తుడిగా భావించుకుంటూ 11 రోజుల పాటు దీక్ష చేపట్టారు. ఈ మేరకు దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఆలయాలను సందర్శించారు. ప్రధానంగా శ్రీరాముడితో అనుబంధం కలిగిన గుళ్లపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.
తమిళనాడు రాష్ట్రంలో భారీ ఎత్తున భారతీయ సంస్కృతికి చెందిన ఆలయాలు ఉన్నాయి. శిల్ప కళకు పెట్టింది పేరు ఈ గుళ్లు, గోపురాలు. సనాతన ధర్మాన్ని ప్రతిబింబించేలా వీటిని తయారు చేయించారు ఆనాటి పాలకులు.
ఇదిలా ఉండగా సముద్రపు నది ఒడ్డున స్నానం చేశారు ప్రధానమంత్రి మోదీ. అనంతరం ఆయన దీక్ష చేపట్టారు. ధ్యాన ముద్రలోకి వెళ్లి పోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారాయి. ఎంతైనా మోదీనా మజాకా అంటున్నారు హిందూ భక్త బాంధవులు.