పరువు నష్టం కేసు వేస్తా
ఎమ్మెల్యే సునీతా లక్ష్మా రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ విప్ సునీతా లక్ష్మా రెడ్డి నిప్పులు చెరిగారు. తనపై లేని పోని ఆరోపణలు చేయడం మానుకోవాలని అన్నారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తాము మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని, అంత లోపే పార్టీ మారుతున్నారంటూ ఎలా ప్రచారం చేస్తారంటూ ప్రశ్నించారు.
ప్రతికూల ప్రచారాన్ని మానుకోవాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు సునీతా లక్ష్మా రెడ్డి. అవసరమైతే తనను కావాలని డ్యామేజ్ చేస్తున్న వారిపై పరువు నష్టం కేసు వేస్తానని అన్నారు.
కేవలం తమ తమ నియోజకవర్గాలలో అభివృద్ది పనుల కోసం మాత్రమే కలిశామని, సీఎంను కలుసు కోవడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు ఎమ్మెల్యే. ప్రజల కోసం తాము పని చేస్తున్నామని, వారి తరపున సమస్యలను ప్రస్తావిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
మిగతా ఎమ్మెల్యేలతో కలిసి ఆమె హైదరాబాద్ లోని పార్టీకి చెందిన ఆఫీసులో మీడియాతో మాట్లాడారు.