ANDHRA PRADESHNEWS

ప‌వ‌న్ రండి ద‌య‌చేయండి

Share it with your family & friends

ఆహ్వానించిన చంద్ర‌బాబు

తాడేప‌ల్లిగూడెం – ఏపీలో ఎన్నిక‌లు మ‌రింత రంజుగా మారాయి. ఎలాగైనా స‌రే ఈసారి ప‌వ‌ర్ లోకి రావాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు అన్ని పార్టీల‌కు చెందిన నేత‌లు. ఈ త‌రుణంలో ఏపీలో ఆక్టోప‌స్ లాగా అల్లుకు పోయిన జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సార‌థ్యంలోని వైసీపీని ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్ర‌బాబు నాయుడు ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

ఈ త‌రుణంలో అనూహ్యంగా ఆయ‌న పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగా సంక్రాంతి పండుగ‌ను పుర‌స్క‌రించుకుని తాడేప‌ల్లి గూడెంలోని త‌న నివాసానికి రావాల్సిందిగా జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆహ్వానించారు. ఈ మేర‌కు ప‌వ‌ర్ స్టార్ చంద్ర‌బాబు ఇంటికి విచ్చేశారు. ఈ సంద‌ర్బంగా శాలువాతో స‌త్క‌రించి బోకే ఇచ్చారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంతోషానికి లోన‌య్యారు. ఆయ‌న వెంట వ‌చ్చిన జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ కు గ్రాండ్ వెల్ క‌మ్ చెప్పారు యువ నేత నారా లోకేష్ బాబు. ఈ సంద‌ర్బంగా గంట‌కు పైగా చంద్ర‌బాబు నాయుడు, ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రిగాయి. ప్ర‌ధానంగా సీట్ల స‌ర్దుబాటుపై ఎక్కువ‌గా ప్ర‌స్తావించిన‌ట్లు స‌మాచారం.

మొత్తం 175 సీట్ల‌కు గాను క‌నీసం 50 నుంచి 60 సీట్లు ఇవ్వాల‌ని జ‌న‌సేన కోరుతున్న‌ట్లు స‌మాచారం. అలాగే లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి క‌నీసం 5 నుం 10 స్థానాలు ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ బాబుతో తేల్చి చెప్పిన‌ట్లు టాక్. దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.