పవర్ కోసం కేటీఆర్ తహ తహ
ఎద్దేవా చేసిన మంత్రి సీతక్క
హైదరాబాద్ – మంత్రి దాసరి సీతక్క నిప్పులు చెరిగారు. ఆమె బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఏకి పారేశారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడారు. విధ్వంస రాజకీయాలకు కేటీఆర్ పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. తాము గనుక తల్చుకుంటే పార్టీ అంటూ ఉండదన్నారు.
అధికారం లేకుండా ఒక్క నిమిషం కూడా నిమ్మళంగా కూర్చోలేక పోతున్నారని మండిపడ్డారు సీతక్క. ఇకనైనా తాము చేసిన తప్పుల గురించి తెలుసుకుంటే మంచిదన్నారు. నోటికి వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు.
తాము సభ్యత, సంస్కారం ఉండి మాట్లాడుతున్నామని కానీ బీఆర్ఎస్ బాస్ ముందు వెనుకా లోచించకుండా ఎడా పెడా ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదన్నారు దాసరి సీతక్క. మీరు అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మితి మీరిన అహంకారం శాపంగా మారిందన్నారు.
అందుకే జనం బండ కేసి కొట్టారని, కాంగ్రెస్ కు పట్టం కట్టారని గుర్తు చేశారు దాసరి సీతక్క.