పారిశ్రామిక అభివృద్దిపై ఫోకస్
వేలాది మందికి ఉపాధి అవకాశం
హైదరాబాద్ – సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి పారిశ్రామిక అభివృద్దికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. మెగా మాస్టర్ ప్లాన్ 2050 పేరుతో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలకు సాదర స్వాగతం పలుకుతామని తెలిపారు.
పరిశ్రమల ఏర్పాటుకు కాంగ్రెస్ అడ్డంకి కాదని కుండ బద్దలు కొట్టారు. స్నేహ పూర్వక పారిశ్రామిక విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తుందన్నారు రేవంత్ రెడ్డి. ఫార్మా సిటీలకు బదులు ఫార్మా గ్రామాలను అభివృద్ది చేస్తామని చెప్పారు.
అవుటర్ రింగ్ రోడ్డు లోని 14 రేడియల్ రోడ్డుకు సమీపంలో 1,000 నుండి 3,000 ఎకరాల విస్తీర్ణంలో ఫార్మా విలేజ్ కు ద్వారాలు తెరుస్తామని తెలిపారు. అర్బన్ , రూరల్ , పట్టణ క్లస్టర్లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు రేవంత్ రెడ్డి.
రీజినల్ రింగ్ రోడ్డు తర్వాత పరిసర ప్రాంతాల్లో రూరల్ క్లస్టర్లను అభివృద్ది చేస్తామన్నారు సీఎం. 1994 నుండి 2004 వరకు తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి అనుసరించిన ఫార్ములా భిన్నమైనదని పేర్కొన్నారు. 2004 నుండి 2014 మధ్య స్వీకరించిన పారిశ్రామిక విధానం మరో స్థాయిలో ఉందని తెలిపారు.
34 లక్షల మంది నిరుద్యోగులు సర్కార్ కు భారం కాదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పాఉట చేస్తామన్నారు.