పీఎం మోదీ వైరల్
లక్షద్వీప్ లో హల్ చల్
లక్షద్వీప్ – భారత దేశంలో ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ కొలువు తీరాక పర్యాటక రంగానికి ప్రాధాన్యత పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా భారతీయ సంస్కృతి, నాగరికతను ప్రతిబింబించేలా ఆయన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా మోదీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి ఇక్కడ కళాకారులు తయారు చేసిన వస్తువులను బహుమతిగా ఇవ్వడం పరిపాటిగా వస్తోంది.
దీని వల్ల మన ప్రతిభ, నైపుణ్యం అనేది వెల్లడి అవుతుందని మోదీ భావన. ఇదే సమయంలో పర్యాటక రంగానికి మంచి భవిష్యత్తు ఉందని కేంద్ర సర్కార్ నమ్ముతోంది. భారీ ఎత్తున ఆదాయం సమకూరుతుందని అంచనా వేసింది కూడా.
తాజాగా స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష ద్వీప్ ను సందర్శించారు. అక్కడి పర్యాటక ప్రాంతాలను చూసి తన్మయత్వానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించి లక్షద్వీప్ పర్యాటక శాఖ స్వయంగా ట్విట్టర్ లో మోదీ ఫోటోలను షేర్ చేసింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మోదీ ఎక్కడికి వెళ్లినా అక్కడి ప్రాంత ప్రజల ఆచార అలవాట్లను , సంస్కృతిని, నాగరికతను తెలుసుకునే ప్రయత్నం చేస్తారు.