పీవీపీ ట్వీట్ నానిపై సెటైర్
బండి షెడ్డు మారిందంతే
అమరావతి – ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వర ప్రసాద్ (పీవీపీ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా గురువారం బెజవాడ ఎంపీ కేశినేని నాని పేరు ప్రస్తావించకుండానే సెటైర్ వేశారు. ఇంత కాలం టీడీపీలో ఉన్న నాని ఉన్నట్టుండి రాజీనామా చేశారు. ఆయనతో పాటు కూతురు శ్వేత నాని కూడా గుడ్ బై చెప్పారు. ఆ వెంటనే సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు. త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రకటించారు.
జగన్ రెడ్డి ఏ పదవి ఇచ్చినా లేక ఇవ్వక పోయినా తాను ప్రజల కోసం పని చేస్తానని స్పష్టం చేశారు కేశి నేని నాని. తాను టీడీపీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అంతే కాదు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును మించిన మోసగాడు ఎవరూ లేరంటూ ఎద్దేవా చేశారు కేసినేని నాని. తనపై రౌడీ మూకలతో దాడులు చేయించేందుకు లోకేష్ ట్రై చేశారంటూ బాంబు పేల్చారు.
ఈ మొత్తం కామెంట్స్ ను పరిగణలోకి తీసుకున్న పొట్లూరి వర ప్రసాద్ కేశినేని నానిని బండితో పోల్చారు. ప్రస్తుతం బండి ఒక్కటే. షెడ్డు మారిందంతే అంటూ పేర్కొన్నారు. నీ సంగతి అంతా బెజవాడ మొత్తానికి తెలుసంటూ మండిపడ్డారు. బ్యాంకులకు కన్నం వేశావు..ఉద్యోగులను పీల్చి పిప్పి చేశావు ఇకనైనా కామ్ గా ఉండంటూ సూచించారు పీవీపీ.