పురస్కార గ్రహీతలకు సీఎం సన్మానం
సత్కరించిన ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – క్రీడా రంగానికి సంబంధించిన అర్జున అవార్డు గ్రహీతలు, ఆసియా గేమ్స్ లో అసాధారణమైన ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు, త్వరలో జరిగే పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మర్యాద పూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. ఈ సందర్బంగా శాలువాలతో సత్కరించారు. మెమెంటోలను బహూకరించారు. పుష్పగుచ్చాలు అందజేశారు రేవంత్ రెడ్డి.
ప్రతి క్రీడాకారుడు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లతో కూడిన సమగ్ర జాబితాను రూపొందించాని సీఎం సీఎస్ ను ఆదేశించారు. తెలంగాణలో క్రీడల అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఆర్థిక సహాయం, ఉద్యోగావకాశాలు, అర్హత ప్రమాణాలకు అనుగుణంగా మరేదైనా మద్దతు వంటి మార్గాలను పరిగణనలోకి తీసుకుని సమర్థవంతమైన పరిష్కారాలను రూపొందించాలని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డిని కలుసుకున్న క్రీడాకారులలో హుసాముద్దీన్ , సింగేషా , నిఖత్ జరీన్, కైనాన్ చెనై డారియన్ , అగసర నందిని, సిక్కి రెడ్డి, గాయత్రి గోపిచంద్, జీవన్ దీప్తి ఉన్నారు.