మందుల షాప్ యజమానికి ఫోన్
సిద్దిపేట – ఎర్రబెల్లి ఫామ్ హౌస్ లో బిజీగా మారారు మాజీ సీఎం కేసీఆర్. పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉన్నారు. అనుకోకుండా రేవంత్ రెడ్డి కొట్టిన దెబ్బకు ప్రభుత్వాన్ని కోల్పోయారు. రేవంత్ చెప్పి మరీ విజయం సాధించారు. దీనిని తట్టుకోలేక పోయారు మాజీ సీఎం.
ఆ వెంటనే ఫామ్ హౌస్ లో ఉన్న సమయంలో బాత్రూంలో కాలు జారి పడ్డారు. దీంతో తుంటి విరిగింది. ఆ వెంటనే కేసీఆర్ ను హుటా హుటిన యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ మెరుగైన చికిత్స అందించారు. శస్త్ర చికిత్స అనంతరం విడుదల చేశారు.
అక్కడి నుండి ఫామ్ హౌస్ కు వెళతారని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా నందిహిల్స్ లో ఉన్న మరో ఇంటికి విచ్చేశారు. కోలుకున్నాక తిరిగి ఫామ్ హౌస్ కు వెళ్లారు. ప్రస్తుతం ఫామ్ హౌస్ లో వ్యవసాయ పనులు చేసుకునేందుకు సిద్దమయ్యారు.
వంటిమామిడిలో ఉన్న ఎరువుల షాప్ యజమానికి ఫోన్ చేసి ఫాంహౌస్ కి విత్తనాలు, ఎరువులు పంపించాలని చెప్పారు కేసీఆర్. పది రోజుల్లో ఫాంహౌస్ కి వచ్చి వ్యవసాయం చూసుకుంటానని చెప్పారు గూలాబీ బాస్.. ఆరోగ్యం గురించి వాకబు చేయగా బాగానే ఉన్నానని చెప్పారు మాజీ సీఎం..