ప్రజా పాలన రాష్ట్రానికి ఆలంబన
30 రోజుల ప్రభుత్వం తీసుకున్ని నిర్ణయం
హైదరాబాద్ – కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణలో 30 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై ఫోకస్ పెట్టింది. ఈ మేరకు ఇప్పటికే 2 గ్యారెంటీలను అమలు చేసింది. తాము మాటలు చెప్పమని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ మేరకు మిగతా గ్యారెంటీల అమలుపై త్వరితగతిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ప్రగతి భవన్ కు ముందుగా ఏర్పాటు చేసిన కంచెలను తొలగించడం జరిగిందని తెలిపారు. సచివాలయానికి ప్రజలు స్వచ్చందంగా తరలి వచ్చేలా చేశామని పేర్కొన్నారు. హామీల అమలుకు శ్రీకారం చుట్టామని , పారదర్శకత కోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేసే పనిలో ఉన్నామని చెప్పారు సీఎం.
ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇచ్చామని, సాగు నీటి ప్రాజెక్టులపై సమీక్ష చేపట్టడం జరిగిందన్నారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. సాగు చేసే రైతులకు భరోసా కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
అసెంబ్లీలో ప్రతిపక్షాలకు తమ వాయిస్ వినిపించేలా అవకాశం కల్పించడం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రజలకు జవాబుదారీతనం ఉండేలా చేశామన్నారు. ప్రజలకు నిరసన తెలిపేందుకు స్వేచ్ఛ కల్పించడం తాము చేపట్టిన పనుల్లో గొప్పదన్నారు. ఆర్థిక ప్రగతి కోసం పరిశ్రమలకు ఆహ్వానం పలికామని, కేంద్ర నిధుల కోసం, విభజన హక్కుల కోసం ఇవ్వాల్సిన నిధుల గురించి ప్రయత్నం చేశామని తెలిపారు రేవంత్ రెడ్డి.