ముందు నుంచీ ప్రజల కోసమే
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన నటుడిగా గుర్తింపు పొందారు. అంతే కాదు ముందు నుంచీ ప్రజలంటే అభిమానం. సమాజం పట్ల బాధ్యతగా ఉండాలని తలపించారు. ఆ మేరకు పలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ వచ్చారు.
తాజాగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికరమైన ఫోటోను మంగళవారం ట్విట్టర్ వేదికగా పంచుకుంది. ఈ మేరకు 1999లో జైళ్ల శాఖ డీజీగా ఎంవీ కృష్ణారావు ఉన్న సమయంలో చంచల్ గూడ లోని మహిళా జైలును సందర్శించారు పవన్ కళ్యాణ్. అందులో మహిళా ఖైదీలు ఎదుర్కొంటున్న స్థితి గతుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఆనాడు డీఐజీ నరసింహా రెడ్డి, మహిళా జైలు పర్యవేక్షణ అధికారిణి లక్ష్మీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ కీలక వ్యాఖ్యలు చేసింది. జనసేన పార్టీ పెట్టక ముందు నుంచీ కూడా పవన్ కళ్యాణ్ సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ వచ్చారని వెల్లడించింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో సామాజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తోంది. ప్రస్తుతం జనసేన పార్టీని ఏర్పాటు చేశారు. ఏపీలో ఎన్నికల్లో బరిలో నిలవనున్నారు.