NEWSTELANGANA

ప్ర‌జా సేవ లోనే స్మిత ఆనందం

Share it with your family & friends

క‌లుస్తున్నందుకు ఆనందంగా ఉంది

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ స్మితా స‌బ‌ర్వాల్ గురించి తెలియ‌ని వారంటూ ఉండ‌రు. ఆమె ఎంత అందంగా ఉంటారో అంతగా వివాదాస్ప‌దంగా మారి పోయారు. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో. కొత్త‌గా కొలువు తీరిన కాంగ్రెస్ స‌ర్కార్ ఉన్న‌ట్టుండి అప్ర‌ధాన పోస్టును అప్ప‌గించింద‌నే ఆరోప‌ణ‌లు లేక పోలేదు. ఇదంతా ప‌క్క‌న పెడితే గ‌తంలో మాజీ సీఎం కేసీఆర్ కు అత్యంత స‌న్నిహితురాలిగా గుర్తింపు పొందారు. చివ‌ర‌కు మిష‌న్ భ‌గీర‌థ‌, కాళేశ్వ‌రం ప్రాజెక్టుల‌లో ఈమె పేరు కూడా వినిపించింది.

సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టినా, చివ‌ర‌కు త‌న శాఖ‌కు సంబంధించి మంత్రి కొలువు తీరినా మ‌ర్యాద పూర్వ‌కంగా కూడా స్మితా స‌బ‌ర్వాల్ క‌లుసుకోక పోవ‌డం విస్తు పోయేలా చేసింది. ఇదే స‌మ‌యంలో ఆమె కేంద్ర స‌ర్వీసులోకి వెళుతుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది.

దీనిపై పూర్తిగా క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు స్మితా స‌బ‌ర్వాల్. తాను ఎక్క‌డికీ వెళ్ల‌న‌ని ఇక్క‌డే ఉంటాన‌ని పేర్కొన్నారు. ఇక ప్ర‌తి రోజూ సోష‌ల్ మీడియాలో పోస్టులు , ఫోటోలు షేర్ చేస్తూ హ‌ల్ చ‌ల్ చేస్తోంది. అయితే ఆర్థిక కార్య‌ద‌ర్శిగా కొలువు తీరిన స్మితా స‌బ‌ర్వాల్ ను క‌లిసేందుకు జ‌నం పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌స్తుండ‌డం విశేషం.