ఆవేదన వ్యక్తం చేసిన కేటీఆర్
హైదరాబాద్ – దేశంలో ఎక్కడా లేని రీతిలో తాము పాలన సాగించామని కానీ ఎందుకనో ప్రజలు తమను దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆదివారం ప్రగతి భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షా సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
ప్రధానంగా తమకు అడ్డంకిగా మారింది మాత్రం బీసీ బంధు, దళిత బంధు , రైతు బంధు పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేసినా చివరలో కొందరికి రాలేదని ఇదే కొంప ముంచేలా చేసిందన్నారు.
నిజాం సాగర్ లో అందరికీ దళిత బంధు ఇచ్చామని కానీ మిగతా వర్గాలు కోపంతో తమకు ఓటు వేయలేదని పేర్కొన్నారు కేటీఆర్. ఒకరికి సాయం అందితే మరొకరికి ఇబ్బందిగా మారిందని, అది అసూయ పడేలా చేసిందని వాపోయారు .
అయితే బీఆర్ఎస్ బాస్, తెలంగాణ జాతి పిత కేసీఆర్ పై ఉన్న అభిమానం అలాగే ఉందని, చెక్కు చెదర లేదన్నారు కేటీఆర్. 1985-89 మధ్య కాలంలో ఆనాడు ఎన్టీఆర్ ఎన్నో పథకాలు తీసుకు వచ్చినా ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓడి పోయారని గుర్తు చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్ కు ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు పునరాలోచనలో పడ్డారని అన్నారు.
అడ్డగోలుగా తాము సర్కార్ ను విమర్శించడం లేదని చెప్పారు. కానీ కావాలని సీఎం రేవంత్ రెడ్డి రెచ్చ గొడుతున్నారని ఆరోపించారు.