ఫిబ్రవరి 9న లాల్ సలామ్ రిలీజ్
సూపర్ స్టార్ రజనీకాంత్ కీ రోల్
తమిళ సినీ రంగానికి చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ ముఖ్య భూమిక పోషించిన లాల్ సలామ్ చిత్రం అప్ డేట్ వచ్చింది. ఈ మేరకు చిత్ర యూనిట్ కీలక ప్రకటన చేసింది. తలైవా అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇందులో భాగంగా వచ్చే నెల ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
ఇప్పటికే సూపర్ స్టార్ గత ఏడాది నటించిన జైలర్ దుమ్ము రేపింది. బాక్సులు బద్దలు కొట్టింది. ఆసియా ఖండం లోనే అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న నటుడిగా చరిత్ర సృష్టించారు. ఈ ఒక్క సినిమాకు సన్ ఇంటర్నేషన్ సంస్థ రూ. 200 కోట్లు ఇచ్చినట్లు సమాచారం.
ఇది పక్కన పెడితే ఊహించని రీతిలో రజనీ నటించిన లాల్ సలామ్ ఉంటుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం విశేషం. ఇక సినీ సంగీత దిగ్గజం అల్లా రఖా రెహమాన్ సంగీతం అందిస్తుండడంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.