ENTERTAINMENT

బాద్ షా డుంకీ సెన్సేష‌న్

Share it with your family & friends

బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్టిన మూవీ

అట్లీ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన జ‌వాన్ రికార్డ్ బ్రేక్ చేశాక షారుక్ ఖాన్, తాప్సీ పన్ను క‌లిసి నటించిన డుంకీ రికార్డ్ క్రియేట్ చేసింది. విడుద‌లైన నాటి నుంచి నేటి దాకా రికార్డుల మోత మోగిస్తోంది. ఓ వైపు ప్ర‌శాంత్ నీల్ తీసిన స‌లార్ ఈ సినిమాతో పోటీ ప‌డింది. ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ్డాయి.

ఇక డుంకీ విడుద‌లై జ‌న‌వ‌రి 10 నాటితో 20 రోజులు పూర్తి చేసుకుంది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు రూ. 400 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసింది. ఇక వ‌సూళ్ల విష‌యానికి వ‌స్తే తొలి రోజు రూ. 57.43 కోట్లు వ‌సూలు చేసింది. 2వ రోజు రూ. 45.10 కోట్లు, 3వ రోజు రూ. 49.71 కోట్లు , 4వ రోజు రూ. 52.78 కోట్లు, 5వ రోజు రూ. 46.56 కోట్లు, 6వ రోజు రూ. 20.31 కోట్లు కొల్ల‌గొట్టింది డుంకీ.

7వ రోజు రూ. 16.80 కోట్లు వ‌సూలు కాగా 8వ రోజు రూ. 12.29 కోట్లు, 9వ రోజు రూ. 12.10 కోట్లు, 10వ రోజు రూ. 16.78 కోట్లు, 11వ రోజు రూ. 20.34 కోట్లు, 12వ రోజు రూ. 17.27 కోట్లు, 13వ రోజు రూ. 9.63 కోట్లు, 14వ రోజు రూ. 7.11 కోట్లు, 15వ రోజు రూ. 5.87 కోట్లు , 16వ రోజు రూ. 4.32 కోట్లు వ‌సూలు చేసింది.

ఇక 17వ రోజు డుంకీ చిత్రం రూ. 6.39 కోట్లు, 18వ రోజు రూ. 6.72 కోట్లు, 19వ రోజు రూ. 3.80 కోట్లు, 20వ రోజు రూ. 2.92 కోట్లు వ‌సూలు చేసింది. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు 20 రోజుల‌కు గాను రూ. 414.23 కోట్లు సాధించింది.