బాబుది రెండు నాల్కల ధోరణి
బాబుదిఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
పలాస – ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును టార్గెట్ చేశారు. రోజుకో మాట మాట్లాడుతూ జనాన్ని బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. పలాసలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు ధర్మాన ప్రసాదరావు.
అధికార వికేంద్రణ అన్నది ముఖ్యమనే ఉద్దేశంతోనే తమ పార్టీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు చేస్తామని ప్రకటించారని చెప్పారు. కానీ దీని వల్ల ప్రపంచం ఏదో మునిగి పోతున్నట్లు నానా హైరానా చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు.
మాయ మాటలు చెప్పడంలో తను ఆరి తేరాడని ఎద్దేవా చేశారు. గతంలో ఏపీలో అధికారంలో టీడీపీ ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు ధర్మాన ప్రసాదరావు. తాము ముందు నుంచి అన్ని రకాలుగా అభివృద్ది చెందాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమన్నారు. కానీ అందుకు భిన్నంగా ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
విశాఖలో సీఎం కార్యాలయం ఏర్పాటు కాకుండా కోర్టులో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. రాజధాని ఎక్కడ అంటూ మాట్లాడటం దారుణంగా ఉందన్నారు ధర్మాన ప్రసాదరావు.