ANDHRA PRADESHNEWS

బాల‌య్య ఓట‌మి ఖాయం

Share it with your family & friends

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ మంత్రి పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్ర‌ముఖ న‌టుడు, టీడీపీ ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌పై నిప్పులు చెరిగారు. ఈసారి జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో హిందూపురంలో బాల‌య్య‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు.

ఆయ‌న‌పై బ‌ల‌హీన వ‌ర్గాల‌కు చెందిన మ‌హిళ‌ను పోటీకి నిల‌బెట్ట బోతున్నామ‌ని , ఈసారి ప‌క్కాగా ఇంటికి వెళ్ల‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. బాల‌కృష్ణ అయినా ఆయ‌న అల్లుడు నారా లోకేష్ అయినా లేదా ఆయ‌న వియ్యంకుడు టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడైనా వెనుదిర‌గాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు.

హిందూపురం అనేది అద్దం లాంటిద‌ని, ఓ రాయి వేస్తే పగిలి పోతుంద‌ని పేర్కొన్నారు. రాబోయే శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో వైసీపీ మ‌రోసారి బంప‌ర్ మెజారిటీతో గెలుస్తుంద‌న్నారు. ఒక‌రిద్ద‌రు వీడినంత మాత్రాన త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేద‌న్నారు పెద్ది రెడ్డి రామ‌చంద్రా రెడ్డి.

వై నాట్ 175 అనే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నామ‌ని చెప్పారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. టీడీపీ, జ‌న‌సేన , బీజేపీ క‌లిసినంత మాత్రాన త‌మ‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ ఉండ‌ద‌న్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తోంద‌ని చెప్పారు ఏపీ మంత్రి.