బాలికలకు పెన్నులు..పుస్తకాలు ఇవ్వండి
పిలుపునిచ్చిన స్మితా సబర్వాల్
హైదరాబాద్ – సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రస్తుత తెలంగాణ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనవరి 24న జాతీయ బాలికల దినోత్సవాన్ని ప్రతి ఏటా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. బాలికలకు చదువు చెప్పించాలని, విద్య విలువ ఏమిటో వారికి నేర్పించాలని ముఖ్య ఉద్దేశం.
అందుకే దివంగత మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి పాలనా కాలంలో సర్వ శిక్షా అభిమాన్ పథకానికి శ్రీకారం చుట్టారు. ఆయన ఆధ్వర్యంలో వచ్చిన ఈ స్కీం ఇప్పుడు కూడా దేశ వ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా బుధవారం ట్విట్టర్ వేదికగా స్మితా సభర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దేశంలోని ప్రతి చిన్నారులకు పుస్తకాలతో పాటు పెన్నులు, పెన్సిళ్లు బహుమతిగా ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇవే వారిని అత్యున్నతమైన భావి భారత పౌరులుగా మారేందుకు దోహద పడుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు స్మితా సభర్వాల్.
ఈ సందర్బంగా భూమిపై ఉన్న ప్రతి దేశంలో విజయానికి సంబంధించిన విత్తనాలు మహిళలు, పిల్లల్లో ఉత్తమంగా నాటడం జరుగుతుందని స్పష్టం చేశారు.