దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపు
విజయవాడ – ఏపీలో బీజేపీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. బెజవాడలో బుధవారం గాంవ్ ఛలో అభియాన్ వర్క్ షాప్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి అరవింద్ మీనన్ హాజరయ్యారు. ఈ సందర్బంగా పురంధేశ్వరి ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీకి అద్భుతమైన బలం ఉందన్నారు. కార్యకర్తలు, శ్రేణులు మరింత పట్టుదలతో పని చేయాలని కోరారు.
ఎన్నికలు ఎంతో దూరంలో లేవన్నారు. రెండు నెలలు కూడా లేదని , ఆ విషయం గుర్తు పెట్టుకుని మరింత సమర్థవంతంగా కృషి చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు పురంధేశ్వరి. పొత్తుల విషయంలో పార్టీ అధినాయకత్వం ఆలోచిస్తుందన్నారు. ఆ తర్వాత ఏ పార్టీతో పొత్తు పెట్టు కోవాలనే దానిపై మీ సలహాలు, సూచనలు కూడా ఇవ్వాలన్నారు.
ఇక పొత్తుల సంగతి తర్వాత ముందు పార్టీని చక్కదిద్దు కోవాలని సూచించారు. ఇవాళ రాష్ట్రానికి కోట్లాది రూపాయలు కేంద్రం మంజూరు చేసిందన్నారు. కానీ వాటిని కాదని కేంద్ర పథకాల స్థానంలో తన పేరు జగన్ మోహన్ రెడ్డి వాడుకుంటున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు పురంధేశ్వరి.