బీజేపీకి రెండు డిప్యూటీ సీఎం పదవులు
పాట్నా – ఇండియా కూటమికి ఊహించని షాక్ ఇచ్చారు బీహార్ సీఎం నితీశ్ కుమార్. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు రావడంలో ముఖ్య పాత్ర పోషించారు. దీనికి ఇండియా అని పేరు పెట్టారు.
తనను కన్వీనర్ గా ఎంపిక చేయక పోవడంతో ఉన్నట్టుండి ఝలక్ ఇచ్చారు. తనను కాదని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు బాధ్యతలు అప్పగించడంతో కూటమికి రామ్ రామ్ చెప్పారు. ఆ వెంటనే తనను కాదని , ఇబ్బందులకు గురి చేసిన బీజేపీతో మళ్లీ చేతులు కలిపారు. చర్చలు ఫలించాయి. చివరకు తనే సీఎంగా ఉండేలా, బీజేపీకి రెండు ముఖ్యమైన డిప్యూటీ సీఎం పదవులు దక్కేలా ఒప్పందం చేసుకున్నారు.
ఇప్పటి దాకా కాంగ్రెస్ తో ఉన్న బంధానికి చెక్ పెట్టారు. తనకు పదవి తప్ప విలువలంటూ ఉండవని మరోసారి బయట పడ్డారు సీఎం నితీశ్ కుమార్. నాలుగు గంటలకు బీహార్ సీఎంగా తిరిగి నితీశ్ కుమార్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. విచిత్రం ఏమిటంటే స్పీకర్ పదవి కూడా బీజేపీకే ఇచ్చేలా ఒప్పందం చేసుకోవడం విస్తు పోయేలా చేసింది.