ANDHRA PRADESHNEWS

బెజ‌వాడ నా గుండె కాయ

Share it with your family & friends

ఎంపీ కేశినేని నాని కామెంట్స్

విజ‌యవాడ – తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ముందు నుంచీ ప్ర‌జ‌ల‌తోనే క‌లిసి ఉంటున్నాన‌ని చెప్పారు. ఆదివారం ఎంపీ మీడియాతో మాట్లాడారు. ప్ర‌జా ప్ర‌తినిధిగా త‌న‌ను ప్ర‌జ‌లు ఓట్లు వేసి గెలిపించార‌ని, ఈ క్ష‌ణం దాకా వారి బాగు కోసం తాను నిరంతరం పాటు ప‌డ్డాన‌ని అన్నారు.

అంద‌రికీ అందుబాటులో ఉండ‌డం, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం త‌న ముందున్న ల‌క్ష్య‌మ‌న్నారు ఎంపీ కేశినేని నాని. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వ‌ర‌కు బెజ‌వాడ‌ను కాపు కాసుకుంటూ ప‌ని చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు ప్రోటోకాల్ ఇచ్చామ‌ని చెప్పేందుకు కొంద‌రు సీటు, బ్యానర్లు వేసుకుంటార‌ని షాకింగ్ కామెంట్స్ చేశారు ఎంపీ. గ‌తంలో ప్రోటోకాల్ పాటించ లేద‌ని ఇప్పుడు వేస్తున్నార‌ని అనుకుంటున్నాన‌ని పేర్కొన్నారు.

తాను ఇప్ప‌టికే మీడియా సాక్షిగా ప్ర‌క‌టించాను. ఎంపీ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు. ఇంక దీని గురించి ఎక్కువ‌గా మాట్లాడాల్సింది ఏముంద‌ని ప్ర‌శ్నించారు కేశినేని నాని. త‌మ కోసం పాటు ప‌డే వారిని ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటార‌ని స్ప‌ష్టం చేశారు. మొత్తంగా ఎంపీ చేసిన తాజా వ్యాఖ్య‌లు ఏపీ రాజ‌కీయాల‌లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.