భట్టి అన్నా ఎట్టున్నవ్ – షర్మిల
కొడుకు పెళ్లికి రావాలని ఆహ్వానం
హైదరాబాద్ – వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకురాల వైఎస్ షర్మిలా రెడ్డి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలుసుకున్నారు. ఆయన నివాసంలో తనతో పాటు కొడుకుతో కలిసి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రికను భట్టికి అందజేశారు. ఈ సందర్బంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
భట్టీ అన్నా బాగున్నారా అంటూ ఆప్యాయంగా పలకరించారు. అంతేకాకుండా అభినందనలు తెలిపారు. మీరు ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చారంటూ కితాబు ఇచ్చారు. అంతే కాదు డిప్యూటీ సీఎం అయినందుకు ప్రశంసలు కురిపొంచారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు వైఎస్ షర్మిలా రెడ్డి.
జనవరి 18న తన తనయుడు రాజా రెడ్డి, ప్రియల నిశ్చితార్థం ఉంటుందని రావాలని కోరారు. ఇదే సమయంలో వచ్చే నెల ఫిబ్రవరిలో 17న పెళ్లి జరుగుతుందని తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలకు తమరు కుటుంబ సమేతంగా విధిగా హాజరు కావాలని కోరారు వైఎస్ షర్మిలా రెడ్డి.
ఇదిలా ఉండగా భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావును కూడా కలిశారు. ఆయన నివాసానికి స్వయంగా వెళ్లారు షర్మిల. ఈ సందర్బంగా ఇన్విటేషన్ ను తన్నీరుకు అందజేశారు. రావాలని కోరారు.