ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్
న్యూఢిల్లీ – ప్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మోక్రాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనను భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రతి ఏటా జనవరి 26న జరిగే గణ తంత్ర దినోత్సవానికి విదేశాల నుంచి ముఖ్య అతిథిగా ఎవరో ఒక దేశానికి చెందిన అధ్యక్షుడు, ప్రధాన మంత్రిని ఆహ్వానించడం పరిపాటి.
తాజాగా శుక్రవారం జనవరి 26న ఢిల్లీలో జరిగిన 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా ఫ్రాన్స్ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మోక్రాన్ హాజరయ్యారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు ప్రాన్స్ చీఫ్.
నా చిరకాల ప్రియమైన మిత్రుడు ప్రధాని నరేంద్ర మోదీ అంటూ కితాబు ఇచ్చారు. మీరు ఇచ్చిన ఆతిథ్యాన్ని తాను మరిచి పోలేనంటూ ప్రశంసలు కురిపించారు. తనను ప్రత్యేక ఆహ్వానితుడిగా పిలించి గౌరవించినందుకు ఆనందంగా ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ఇలాగే సత్ సంబంధాలు కొనసాగాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు ఇమ్మాన్యూయెల్ కాంట్. ఇదిలా ఉండగా ప్రధాని మోదీతో తీసుకున్న ఫోటోను ప్రత్యేకంగా షేర్ చేశారు.