భారత్ జోడో న్యాయ్ యాత్ర షురూ
మోదీ సర్కార్ పై గుస్సా
మణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర జనవరి 14న మకర సంక్రాంతి పండుగ నాడు ప్రారంభమైంది. మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ నుంచి భారీ ఎత్తున తరలి వచ్చిన అశేష జన సమూహం సాక్షిగా రాహుల్ గాంధీ పాద యాత్రకు శ్రీకారం చుట్టారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర 15 రాష్ట్రాల్లోని 100 లోక్ సభ నియోజకవర్గాల ద్వారా కొనసాగుతుంది. గత ఏడాది రాహుల్ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజాదరణ చూరగొంది. ఎనలేని ప్రచారాన్ని రాహుల్ కు తెచ్చి పెట్టేలా చేసింది.
మోదీ హయాంలో మణిపూర్ లో తీవ్రమైన హింస చోటు చేసుకుంది. దానిని నియంత్రించడంలో పూర్తిగా విఫలమైంది. బాధితులకు అండగా నిలిచేందుకు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు. మోదీని నిలదీస్తున్నారు.
ప్రత్యేకించి నిరుద్యోగం, ధరల పెరుగుదల, సామాజిక న్యాయం వంటి సమస్యలపై ఫోకస్ పెట్టనున్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రజా సమస్యలను లేవనెత్తేందుకు మోదీ బీజేపీ సర్కార్ ఛాన్స్ ఇవ్వక పోవడం వల్లనే తాను భారత్ జోడో యాత్రను చేపట్టానని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. అయితే ఇది ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న యాత్ర కాదని పేర్కొన్నారు.