భారత్ న్యాయ్ యాత్రలో యువత కీలకం
యువజన కాంగ్రెస్ కు రాహుల్ పిలుపు
న్యూఢిల్లీ – ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ యువతను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే ముందు యువత అన్ని రంగాలలో కీలకమకైన పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
శుక్రవారం న్యూఢిల్లీలో ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గం జరిగింది. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువజనులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చని అన్నారు. ఈ దేశ భవిష్యత్తు మీపైనే ఆధారపడి ఉందన్నారు. దీనిని గమనించి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం చేయాలన్నారు.
ఈ దేశంలో అపారమైన వనరులు ఉన్నాయని, వాటిని గుర్తించి సద్వినియోగం చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది మీరేనని గుర్తు చేశారు. ప్రజలకు మోదీ ప్రభుత్వం చేస్తున్న దురాగతాలను, తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు రాహుల్ గాంధీ.