మహేష్ లుక్స్ అదుర్స్
గుంటూరు కారం ట్రైలర్
తెలుగు సినీ ఇండస్ట్రీలో అందాల రాకుమారుడిగా పేరు పొందిన ప్రిన్స్ మహేష్ బాబు వైరల్ గా మారారు. మాటల మాంత్రికుడిగా పేరు పొందిన దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన గుంటూరు కారం మూవీ ట్రైలర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. సాఫ్ట్ పాత్రలకే పరిమితం అయ్యే ప్రిన్స్ ను ఉన్నట్టుండి మాస్ క్యారెక్టర్ లో నటించేలా చేశాడు డైరెక్టర్.
మహేష్ బాబుకు జోడీగా అందాల ముద్దుగుమ్మ శ్రీలీల నటించింది. ఇద్దరూ కలిసి చేసిన డ్యాన్స్ కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. హైదరాబాద్ లోని సుదర్శన్ థియేటర్ లో చిత్ర యూనిట్ గుంటూరు కారం ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
సంక్రాంతి కానుకగా ఈనెల 12న మహేష్ బాబు సినిమా విడుదల కానుంది. నాగ వంశీ ఈ మూవీకి నిర్మాత. వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుండడంతో ఓవర్సీస్ లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి గుంటూరు కారం చిత్రంపై.
ఇక మూవీ విషయానికి వస్తే చిత్రం ప్రారంభం నుంచి విడుదల అయ్యేంత దాకా రూమర్స్ పెద్ద ఎత్తున వచ్చాయి. పూజా హెగ్డేను అనుకున్నారు. ఆమె ఉన్నట్టుండి తప్పుకుంది. ఆమె స్థానంలో శ్రీలీల ఎంటర్ అయ్యింది. రెండో హీరోయిన్ గా మీనాక్షి చౌదరిని తీసుకున్నాడు దర్శకుడు. ఇక గుంటూరు కారంకు సంబంధించిన మహేష్ లుక్స్ మాత్రం కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయని ఫ్యాన్స్ అంటున్నారు.