కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ – అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మంత్రి కేటీఆర్ ను , అధికారాన్ని అడ్డం పెట్టుకుని నానా రకాలుగా ప్రజలను ఇబ్బందులకు గురి చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్.
గతంలో షకీల్ కొడుకు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఓ చిన్నారి మృతికి కారకుడయ్యాడు. ఆనాడు బీఆర్ఎస్ పవర్ లో ఉండడంతో పోలీసులను మ్యానేజ్ చేశాడన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా కొత్తగా కాంగ్రెస్ సర్కార్ కొలువు తీరింది.
ప్రజా భవన్ ముందు కొడుకు స్పీడ్ గా వాహనం నడిపి గుద్దాడు. ఈ కేసులో వేరొకరిని చేర్చే ప్రయత్నం చేశాడు మాజీ ఎమ్మెల్యే షకీల్. అప్పటి నుంచి ఇప్పటి దాకా కనిపించకుండా పోయాడు కొడుకు. దుబాయ్ కి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజాగా పోలీసులు కొడుకుతో పాటు తండ్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ పై కేసు నమోదు చేయడం కలకలం రేపింది. కేసు విచారణలో భాగంగా దుబాయ్ లో దాక్కున్న షకీల్ కుమారుడిని తెలంగాణకు రప్పించేందుకే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం.