మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అరెస్ట్
రూ. 400 కోట్ల విలువ ఉంటుందని అంచనా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో మరో అవినీతి తిమింగలం బయట పడింది. తెలంగాణను అడ్డం పెట్టుకుని గత ప్రభుత్వంలో అధికారాన్ని చెలాయించిన ఉన్నతాధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్ కు అనుచరుడిగా పేరు పొందిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు చెందిన ఇళ్లల్లో, బంధువులకు చెందిన వారిపై మూకుమ్మడి దాడులు, సోదాలు చేపట్టింది.
కళ్లు చెదిరేలా నోట్ల కట్టలు, బంగారు ఆభరణాలు బయట పడ్డాయి. స్థలాలకు చెందిన విలువ ఏకంగా రూ. 300 కోట్ల నుంచి రూ. 400 కోట్ల దాకా ఉంటుందని అంచనా. నగలు, నగదు ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు.
నానక్ రామ్ గూడ లోని శివ బాలకృష్ణ ఇంట్లో రూ. 84 లక్షలు స్వాధీనం చే\సుకున్నారు. హైదరాబాద్ లో విల్లాలు, ప్లాట్లు, ఫ్లాట్స్ , నగర శివారు ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములు ఉన్నాయని గుర్తించారు. దాదాపు 100 ఎకరాలకు పైగా భూమి పత్రాలు స్వాదీనం చేసుకున్నారు. మొత్తం 20 చోట్ల సోదాలు చేపట్టింది ఏసీబీ.