దీక్ష విరమించిన మనోజ్ జరంగే
మహారాష్ట్ర – ఎట్టకేలకు మరాఠా ఆందోళన ముగిసింది. గత కొన్ని రోజులుగా భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా మనోజ్ జరంగే ఆధ్వర్యంలో పోరాట బాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించేంత వరకు తాము ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించారు. తొలుత షిండే సర్కార్ సర్ది చెప్పే ప్రయత్నం చేసింది. కానీ ఆందోళనకారులు దీక్షను విరమించేందుకు ఒప్పుకోలేదు.
దీంతో స్వయంగా రంగంలోకి దిగారు మరాఠా సీఎం ఏక్ నాథ్ షిండే. తానే స్వయంగా ఆందోళన చేపట్టిన ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే వద్దకు వెళ్లారు. తాను మీకు ఉన్నానంటూ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం మీరు కోరిన , కావాల్సిన డిమాండ్లను పరిష్కరించేందుకు సిద్దంగా ఉన్నానంటూ హామీ ఇచ్చారు సీఎం.
దీంతో మనోజ్ జరంగే పాటిల్ నిరాహారదీక్ష విరమించారు. సీఎం షిండేపై తమకు సంపూర్ణ నమ్మకం ఉందన్నారు. తమ డిమాండ్లు న్యాయ బద్దమైనవని ఒప్పుకున్నారని, ఈ మేరకు తమకు లేఖ కూడా అందజేశారని తెలిపారు. షిండే పాటిల్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. దీంతో మరాఠా ఆందోళనకు తెర పడింది. మొత్తంగా సీఎం చేసిన ప్రయత్నం ఫలించింది.