రాజకీయాలు పక్కన పెట్టేసి
కర్ణాటక – దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పీఎం భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి. డీకే కాంగ్రెస్ పార్టీ లీడర్. ఇద్దరూ రాజకీయ పరంగా ఉద్దండులే. ఒకరు పీఎం మరొకరు డిప్యూటీ సీఎం.
రాజకీయాలలో మాటల తూటాలు పేల్చడం మామూలే. కానీ గౌరవించడం అన్నది ప్రజాస్వామ్యంలో ముఖ్యం. నిన్నటి దాకా ఉప్పు నిప్పు లాగా ఉన్నప్పటికీ ప్రోటోకాల్ పాటించడంలో తాము తీసిపోమంటూ చెప్పకనే చెప్పారు డీకే శివకుమార్.
కర్ణాటకలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీని పవర్ పోయేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు డీకే శివకుమార్. ఆయనకు ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ అన్న పేరుంది. మనోడు ఎవరినైనా సరే తన వైపు తిప్పుకునే దమ్ము కలిగిన , రాజకీయ చైతన్యం కలిగిన వ్యక్తి.
అటు కర్ణాటకలో చక్రం తిప్పిన డీకే ఇటు తెలంగాణలో తాజాగా జరిగిన ఎన్నికల్లో సైతం తనదైన ముద్ర కనబర్చారు. ఇక మోదీ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన జగమెరిగిన ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన నాయకుడు. ఇద్దరూ రాజకీయ ఉద్దండులే కావడం విశేషం.