NATIONALNEWS

మోదీ అన్యాయ పాల‌న‌పై యుద్దం

Share it with your family & friends

ప్ర‌క‌టించిన రాహుల్ గాంధీ

మ‌ణిపూర్ – ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కొంత కాలంగా మ‌ణిపూర్ ర‌గులుతున్నా ఇంత వ‌ర‌కు బాధ్య‌తాయుత‌మైన ప్ర‌ధాన మంత్రి ప‌ద‌విలో ఉన్న న‌రేంద్ర మోదీ ఇంత వ‌ర‌కు సంద‌ర్శించిన పాపాన పోలేద‌న్నారు. భార‌తీయ జ‌న‌తా పార్టీ, రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్, విశ్వ హిందూ ప‌రిష‌త్ వివ‌క్ష‌కు మ‌ణిపూర్ ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు రాహుల్ గాంధీ.

శాంతిని, గౌర‌వాన్ని తిరిగి తీసుకు వ‌స్తామ‌ని తాను మాటిస్తున్నాన‌ని అన్నారు. ఆదివారం భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌ను మ‌ణిపూర్ లోని ఇంఫాల్ వేదిక‌గా ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు రాహుల్ గాంధీ.

భార‌త్ జోడో న్యాయ్ యాత్ర ఎందుకు అని కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నార‌ని అందుకే అన్యాయమైన కాలంలో , పాల‌న‌లో ఉన్నామ‌ని అందుకే ఈ యాత్ర చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు. దేశంలో సంప‌ద‌, వ్యాపారాలు ఒక‌రిద్ద‌రి చేతుల్లోకి వెళ్లాయ‌ని ఆరోపించారు. నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెర‌గ‌డం ప్ర‌జ‌ల‌పై పెను భారంగా మారింద‌న్నారు.

అణ‌గారిన బాధ‌ల‌ను ప‌ట్టించుకునే వారు లేకుండా పోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను భార‌త్ జోడో న్యాయ్ యాత్ర‌లో ప్ర‌స్తావిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.