నిప్పులు చెరిగిన ఖర్గే
న్యూఢిల్లీ – కేంద్రంలో కొలువు తీరిన మోదీ సర్కార్ పై నిప్పులు చెరిగారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్రకు అద్బుతమైన రీతిలో ఆదరణ లభిస్తోందని అన్నారు. దేశానికి స్వేచ్ఛ లభించిన నాటి నుంచి నేటి దాకా చూస్తే తమ హయాంలో అభివృద్ధి కొనసాగిందన్నారు. కానీ మోదీ వచ్చాక ఈ దేశం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్నారు.
అయోధ్య రామ మందిరం పేరుతో రాజకీయం చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు మల్లికార్జున్ ఖర్గే. గతంలో ఎన్నడూ లేని రీతిలో నిరుద్యోగులు పెరిగి పోయారని, వారు తీవ్ర నిరాశలో ఉన్నారని భరోసా ఇచ్చే ఏ కార్యక్రమాన్ని ఇంత వరకు చేపట్టక పోవడం దారుణమన్నారు.
ద్రవ్యోల్బణం పెరిగి పోయిందని, ప్రజా సంపాదనకు తూట్లు పొడిచారని, దేశంలోని అపారమైన వనరులను కార్పొరేట్ కంపెనీలకు, వ్యాపారవేత్తలకు ధారాదత్తం చేశారని ఆరోపించారు ఖర్గే. ఇకనైనా తన తప్పు తెలుసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇండియా కూటమి అధికారం కోసం ఏనాడూ ప్రయత్నం చేయదన్నారు. కానీ ప్రజల తరపున ఉంటూ తన వాయిస్ వినిపిస్తూనే ఉంటుందని హెచ్చరించారు ఏఐసీసీ చీఫ్. ఇవాళ ఆయన ఇండియా కూటమి కన్వీనర్ గా ఉన్నారు.