ఆడుతున్నందుకే వదులుకున్నా
అమరావతి – ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత తిరిగి తాను ఆడుతున్నట్లు తెలిపాడు. ఆపై పాలిటిక్స్ వైపు చూశారు. ఉన్నట్టుండి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశాడు. పార్టీ కండువా కప్పుకున్నారు. తీరా అందరూ అనుకునే లోపే తాను పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశాడు.
ముందు నుంచీ అంబటి రాయుడు తీసుకునే నిర్ణయాలపై ఎవరికీ సదభిప్రాయం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో, తిరిగి తాను దానిని ఎలా పక్కన పెడతాడో తెలుసు. ప్రస్తుతం పార్టీ నుంచి వీడడంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు అంబటి రాయుడు.
తాను ఈనెల 20 నుంచి దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్ లో పాల్గొంటున్నానని , ముంబై ఇండియన్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నానని అందుకే రాజీనామా చేయడం జరిగిందని చెప్పారు. ఇందులో ఎలాంటి పాలిటిక్స్ లేవని స్పష్టం చేశారు అంబటి రాయుడు.
వృత్తి పరమైన క్రికెట్ ఆడుతున్న సమయంలో రాజకీయాలలో పాలు పంచు కోకూడదని, ఇది బీసీసీఐ రూల్ అని పేర్కొన్నారు. ఏదో ఒకటి చేయాలని అనుకున్నప్పుడు తాను పాలిటిక్స్ నుంచి తప్పుకోవడమే మంచిదని ఆలోచించినట్లు తెలిపారు.