రామకృష్ణన్నా ఎట్లున్నవ్
కొణతాలతో షర్మిల ముచ్చట
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారి పోతున్నాయి. ఈసారి చతుర్మఖ పోటీ జరగనుంది. మరో వైపు ఏపీలో మరోసారి పవర్ లోకి రావాలని వైసీపీ బాస్ , సీఎం జగన్ మోహన్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇదే సమయంలో ఊహించని రీతిలో ఎంట్రీ ఇచ్చారు జగన్ సోదరి వైఎస్ షర్మిలా రెడ్డి. ఆమె వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు.
జోష్ పెంచారు. ఏపీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రంగంలోకి దిగారు. తన యాక్షన్ ప్లాన్ షురూ చేశారు. ప్రధానంగా తన అన్న జగన్ రెడ్డిని, ప్రతిపక్ష నేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. ఇదే సమయంలో ఇద్దరూ రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టారని సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా ఈనెల 23 నుంచి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. కాగా అపూర్వమైన సన్నివేశానికి వేదికైంది అమరావతి. ప్రచారంలో పాల్గొనేందుకు వచ్చిన షర్మిల బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. మాజీ మంత్రి కొణతాల రామకృష్ణను ఆయన నివాసంలో కలుసుకున్నారు. అన్నా ఎట్లున్నావంటూ ఆప్యాయంగా పలకరించారు. ఆయన జనసేన పార్టీలో చేరుతారా లేక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.