NATIONALNEWS

రాముడి కోసం మోదీ ఉప‌వాసం

Share it with your family & friends

11 రోజుల పాటు దీక్ష చేప‌ట్టిన పీఎం

న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా ఈనెల 22న అయోధ్య లోని రామ మందిరం పునః ప్రారంభోత్స‌వంపై ఉత్కంఠ నెల‌కొంది. కోట్లాది మంది వేచి చూస్తున్నారు. కేంద్ర ప్ర‌భుత్వం దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ త‌న భుజాల మీద మోస్తున్నారు. కార్య‌క్ర‌మాల ఏర్పాట్ల‌పై ఫోక‌స్ పెట్టారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించ‌నున్నారు. ఇందుకు సంబంధించి దేశ వ్యాప్తంగా కీల‌క‌మైన న‌గ‌రాల‌ను సంద‌ర్శిస్తున్నారు ప్ర‌ధాని. ప్ర‌ధాని 11 రోజుల పాటు క‌ఠిన‌మైన త‌పస్సు చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో ఎలాంటి ఆహారం తీసుకోవ‌డం లేదు. ఆయ‌న శ్రీ‌రామ భ‌క్తుడు. మోదీ ప్ర‌ధానిగా కొలువు తీరాక ఆల‌యాలు, మ‌తం ప్రాతిపదిక‌న ప్ర‌యారిటీ పెరిగింది.

కేవ‌లం న‌రేంద్ర మోదీ కొబ్బ‌రి నీళ్ల‌ను మాత్ర‌మే తీసుకుంటున్నార‌ని స‌మాచారం. నేల మీద దుప్ప‌టి వేసుకుని నిద్రిస్తుండ‌డం విశేషం. ఆల‌యాల‌ను సంద‌ర్శించ‌డం. గోవుల‌కు పూజ‌లు చేయ‌డం, వాటికి ఆహారం అందిస్తున్నారు. ఇదే సమ‌యంలో భార‌త దేశానికి చెందిన పేరు పొందిన గ్రంథాల‌ను ప‌ఠిస్తున్నారు.

అయోధ్య రామ మందిరం కార్య‌క్ర‌మం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటూ అన్న‌దానం, వ‌స్త్ర దానం చేస్తున్నారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ. అయితే కొన్ని రోజులుగా ప్ర‌ధాని కేవ‌లం రాముడి జీవితంతో, క‌థ‌తో ముడి ప‌డి ఉన్న ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు. జాతీయ స్థాయిలో చ‌ర్చ‌నీయాంశంగా మారారు ప్ర‌ధాని.