రాముడి సన్నిధిలో జనసేనాని
పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
అయోధ్య – దేశ వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన అయోధ్య లోని రామాలయం పునః ప్రతిష్ట కార్యక్రమం ముగిసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీరాముడి విగ్రహానికి తానే స్వయంగా తిలకం దిద్దారు మోదీ.
ఈ కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున ప్రముఖులు వివిధ రంగాలకు చెందిన వారంతా చేరుకున్నారు. ఇక సినీ రంగానికి వస్తే టాప్ హీరోలు, హీరోయిన్లు కొలువు తీరారు. వీరిలో తమిళనాడుకు చెందిన సూపర్ స్టార్ రజనీకాంత్ , టాలీవుడ్ కు చెందిన మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ , పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
ప్రతి ఒక్క భారతీయుడి కల రామాలయమని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగిస్తూ ఇవాళ నిజమైన దీపావళి పండుగ అన్నారు. 500 ఏళ్లుగా దీని కోసమే మనం వేచి చూస్తున్నామని, రామాలయం ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చిన భారత దేశ సర్వోన్నత న్యాయ స్థానానికి ధన్యవాదాలు తెలిపారు.