రాహుల్ యాత్ర సక్సెస్ కావాలి
వాహనంపై పోస్టర్ అతికించిన రేవంత్
హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. పార్టీ పరంగా, పాలనా పరంగా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని శాఖలను జల్లెడ పట్టారు. అనవసర ఖర్చును తగ్గించాలని ఆదేశించారు. ఇదే సమయంలో ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి భారత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే తొలి విడతలో చేపట్టిన యాత్రకు అనూహ్యమైన రీతిలో స్పందన లభించింది.
త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఇందులో భాగంగా పార్టీని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు, బలోపేతం చేసేందుకు, ప్రజలను చైతన్యవంతం చేసేందుకు గాను భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టనున్నారు.
ఈనెల 14న ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా ఆయనకు మద్దతుగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి వాహనంపై పోస్టర్ ను అతికించారు. రాహుల్ గతంలో తమిళనాడు నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్రను చేపట్టారు. కర్ణాటక, ఏపీ, తెలంగాణలో కూడా చేపట్టిన భారత్ జోడో యాత్రకు అద్భుతమైన రీతిలో ప్రజలు ఆదరించారు.
కర్ణాటక, తెలంగాణలో ఈ యాత్ర బలమైన ముద్ర వేసింది. అంతే కాకుండా అటు కర్ణాటకలో బీజేపీ సర్కార్ ను, ఇటు తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టడంలో కీలక పాత్ర పోషించింది ఈ యాత్ర అని చెప్పక తప్పదు.