రేపే ప్రధాని మోదీ రాక
లేపాక్షిని సందర్శించనున్న పీఎం
శ్రీ సత్య సాయి జిల్లా – ఈనెల 22న అయోధ్య లోని శ్రీరాముడి విగ్రహ పునః ప్రతిష్ట కార్యక్రమం కోసం దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తోంది. ఈ సమయంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని ఆలయాలను , ప్రార్థనా మందిరాలు, స్థలాలను ఈనెల 14 నుంచి 22 వరకు శుభ్రం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో ఒక వెల్లువలా ప్రజలు తరలి వస్తున్నారు. ఆలయాలను , ప్రార్థనా మందిరాలను దర్శించుకుంటున్నారు.
అంతే కాకుండా తమకు తోచినంత మేర ఆలయ ప్రాంగణాలను, ప్రార్థనా స్థలాలను పరిశుభ్రం చేసే కార్యక్రమంల పాలు పంచుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఈనెల 16న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా రూ. 541 కోట్ల అంచనాలతో శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ కస్టమ్స్ , పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఏర్పాటు, 503 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణా కేంద్రం, ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. లేపాక్షి ఆలయాన్ని సందర్శించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.