NEWSTELANGANA

రేవంత్ నిర్ణ‌యం ర‌ఘునంద‌న్ ఆగ్ర‌హం

Share it with your family & friends

వెంట‌నే జీవో 55ను ర‌ద్దు చేయాలి
హైద‌రాబాద్ – బీజేపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ర‌ఘునంద‌న్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్ర స‌ర్కార్ ఏ ప‌ద్ద‌తిన అగ్రిక‌ల్చ‌ర్ యూనివ‌ర్శిటీ ప్రాంగణంలో హైకోర్టుకు భూములు కేటాయిస్తూ జీవో జారీ చేసింద‌ని ప్ర‌శ్నించారు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

జారీ చేసిన జీవో 55 ను వెంట‌నే ర‌ద్దు చేయాల‌ని ర‌ఘునంద‌న్ రావు డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు ఏర్ప‌డుతుంద‌న్నారు. ఇందుకు సంబంధించి వీసీలు ఎలా సంత‌కం చేశార‌ని ప్ర‌శ్నించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొన్నారు.

అయితే కొత్త హైకోర్టు ఏర్పాటుకు బీజేపీ వ్య‌తిరేకం కాద‌ని స్ప‌ష్టం చేశారు. దానిని యూనివ‌ర్శిటీలో కాకుండా మ‌రో చోటకు త‌ర‌లించాల‌ని కోరారు. ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది లేకుండా చూడాల‌ని, ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీల‌ను అమ‌లు చేయ‌డంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోక‌స్ పెట్టాల‌ని సూచించారు.

ఇప్పుడున్న హైకోర్టు ను అక్క‌డే ఉంచాల‌ని స్ప‌ష్టం చేశారు. సిటీకి దూరంగా ఏర్పాటు చేయ‌డం చాలా మందికి ఇబ్బంది అవుతుంద‌న్నారు ర‌ఘునంద‌న్ రావు.