NEWSTELANGANA

రేవంత్ రెడ్డితో మేయ‌ర్ భేటీ

Share it with your family & friends

కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌లు

హైద‌రాబాద్ – అభివృద్ది జ‌ర‌గాలంటే పార్టీల‌ను ప‌క్క‌న పెట్టాల‌ని భావించారు హైద‌రాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ మేయ‌ర్ . శ‌నివారం ఆమె సీఎం రేవంత్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లుసుకున్నారు. ఈ సంద‌ర్బంగా ప‌లు అంశాల‌పై చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆమె సీఎంకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందించారు.

కొత్త‌గా కొలువు తీరిన మీరు మ‌రింత ఎద‌గాల‌ని కోరారు. ఎన్నిక‌ల కోడ్ రానుంద‌ని, త్వ‌ర‌లోనే రాష్ట్రంలో లోక్ స‌భ ఎన్నిక‌లు రానున్నాయి. ఈ త‌రుణంలో ఆమె భార‌త రాష్ట్ర స‌మితి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా స్టాండింగ్ కౌన్సిల్ క‌మిటీల‌ను ఏర్పాటు చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, దీనికి సీఎం స‌హ‌కారం అందించాల‌ని కోరారు జీహెచ్ఎంసీ మేయ‌ర్. స‌ర్వ స‌భ్య స‌మావేశం , కార్పొరేష‌న్ బ‌డ్జెట్ ను ప్ర‌వేశ పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నొక్కి చెప్పారు.

మేయ‌ర్ చెప్పిన అంశాల గురించి సావ‌ధానంగా విన్నారు. ఈ మేర‌కు త్వ‌ర‌లోనే క‌మిటీల‌ను ఏర్పాటు చేసేందుకు స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి.