లండన్ లో రేవంత్ బిజీ
స్మారక కట్టడాల సందర్శన
లండన్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారు. తెలంగాణ ఎన్నారైలతో ఆయన ముచ్చటించారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసేందుకు మీ సహకారం కావాలని పిలుపునిచ్చారు. సీఎం పర్యటనలో తొలిసారిగా లండన్ లో అడుగు పెట్టిన రేవంత్ రెడ్డికి అడుగడుగునా హర్షధ్వానాల మధ్య గ్రాండ్ వెల్ కమ్ లభించింది.
ఈ సందర్బంగా మూసీ నది అభివృద్దిపై ప్రత్యేకంగా చర్చించారు. అంతకు ముందు బ్రిటీష్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ కీలక సమావేశంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా పాల్గొనడం విశేషం.
ఇదిలా ఉండగా మొత్తం ఆరు రోజుల పాటు విదేశాలలో పర్యటించన్నారు. ఇప్పటికే దావోస్ లో జరిగిన ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. రూ. 40,000 వేల కోట్లకు పైగా పెట్టుబడులను 200 సంస్థలతో కలిసి ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో కీలక పాత్ర పోషించారు సీఎం రేవంత్ రెడ్డి.
తాజాగా లండన్ లో చిరస్మరణీయమైన ప్రాంతాలను, స్మారక స్థూపాలను సందర్శించారు. ఆయనకు హెచ్ఎండీసీ కార్యదర్శిగా నియమితులైన ఉన్నతాధికారిణి అమ్రాపాలి సీఎంకు వివరించారు.