సచిన్ రికార్డ్ బ్రేక్
ప్రపంచ క్రికెట్ లో మోస్ట్ పాపులర్ క్రికెటర్ ఆసిస్ కు చెందిన డేవిడ్ వార్నర్. మనోడికి భారత్ లోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. కారణం తను ఇక్కడే ఎక్కువ కాలం గడిపాడు. ప్రతి ఐపీఎల్ లోనూ తనకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తన సారథ్యంలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ తీసుకు వచ్చాడు. ఆ తర్వాత అనూహ్యంగా ఆ జట్టు నుంచి తొలగించబడ్డాడు. ఒక రకంగా అవమానించ బడ్డాడు.
అయినా ఎక్కడా తగ్గలేదు డేవిడ్ వార్నర్. మళ్లీ పుంజుకున్నాడు. తానేమిటో, తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. తన బ్యాట్ తో పరుగుల వరద పారించాడు. చివరకు తనను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో ఎంపికయ్యాడు. ఏకంగా భారత్ ను భారత్ లో ఓడించి ఆ జట్టు విశ్వ విజేతగా నిలిచింది. అందులో తను కూడా ఒకడు.
విచిత్రం ఏమిటంటే తను ఐపీఎల్ లో ఆడుతున్నా ప్రస్తుతానికి వన్డే, టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. అందరినీ , క్రికెట్ లోకాన్ని విస్తు పోయేలా చేశాడు. వచ్చే టీ20 వరల్డ్ కప్ దాకా ఆడాలని తనకు ఉందని తెలిపాడు. ఇక ఓపెనర్ గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పై నమోదై ఉండేది. కానీ ఆ రికార్డ్ ను వార్నర్ మామ బ్రేక్ చేశాడు.