ప్రకటించిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఆయనకు క్రీడలంటే ఇష్టం. తాజాగా హైదరాబాద్ లో త్వరలో భారత్..ఇంగ్లండ్ జట్ల మధ్య ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ సందర్బంగా ఖుష్ కబర్ చెప్పారు సీఎం.
అదేమిటంటే క్రికెట్ అంటే ఇష్టపడని చిన్నారులు, పిల్లలు, విద్యార్థులు, మహిళలు, యూత్, వృద్దులంటూ ఉండరు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా విద్యార్థులకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఎంత మంది విద్యార్థులు వచ్చినా సరే మన జట్టు ఆడే టెస్టు మ్యాచ్ ను చూసేందుకు ఉచితంగా అవకాశం కల్పించనున్నట్లు వెల్లడించారు రేవంత్ రెడ్డి.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఎవరైనా సరే రావచ్చని, వారందరికీ ఫ్రీగా మ్యాచ్ చూసేందుకు అవకాశం కల్పించనున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా వారికి ఉచితంగా మధ్యాహ్నం భోజనం కూడా అందించనున్నట్లు తెలిపింది. సో తమ పట్ల ఇంత ప్రేమను చూపించిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.