వెంకయ్యకు చిరు అభినందన
అపారమైన రాజకీయ అనుభవం
హైదరాబాద్ – భారత దేశ రాజకీయాలలో మేరునగ ధీరుడు మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అని కొనియాడారు మెగాస్టార్ చిరంజీవి. కేంద్ర ప్రభుత్వం తాజాగా అత్యున్నతమైన 132 పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్ పురస్కారాలు ఉండగా 17 మంది పద్మ భూషణ్, 115 మందికి పద్మశ్రీ పురస్కారాలను వెల్లడించింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు ఉద్దండులను ఎంపిక చేసింది. ప్రత్యేకించి రాజకీయ పరంగా అజాత శత్రువుగా గుర్తింపు పొందారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆయన ఎమ్మెల్యే నుంచి ఎంపీగా , కేంద్ర మంత్రిగా, దేశ అత్యున్నతమైన పదవిగా భావించే ఉప రాష్ట్రపతి పదవిని నిర్వహించారు. రాజకీయ నాయకుడిగానే కాకుండా మంచి వక్తగా, రచయితగా పేరు పొందారు వెంకయ్య నాయుడు.
ఇదిలా ఉండగా మరొకరు కొణిదెల చిరంజీవి. ఆయన ఓ సాధారణమైన కానిస్టేబుల్ కొడుకు. తన తమ్ముళ్లు నాగబాబు, పవన్ కళ్యాణ్ లను కూడా సినీ రంగంలో నిలబడేలా చేశారు. ఈ సందర్బంగా ఆయన చేసిన సేవలకు గాను చిరంజీవికి కూడా పద్మ విభూషణ్ ప్రకటించింది కేంద్రం.
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడును చిరంజీవి కలుసుకుని, సన్మానించారు. ప్రత్యేకంగా అభినందించారు.