వైసీపీకి షాక్ కొలుసు జంప్
చంద్రబాబుతో పార్థసారథి భేటీ
అమరావతి – ఏపీలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రత్యేకించి అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్ కు బిగ్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు , ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న కొలుసు పార్థ సారథి గత కొంత కాలం నుంచి అసంతృప్తితో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆయన పదే పదే ఎండగడుతూ వస్తు్నారు. దీంతో ఆయనకు టికెట్ ఇచ్చే విషయంలో డైలమాలో ఉన్నారు వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఇదే సమయంలో తాను పార్టీని వీడుతున్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు కొలుసు పార్థసారథి. ఆ వెంటనే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ముందుకు వెళుతున్నాయి. కూటమిగా ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించాయి.
వైసీపీని వీడుతున్నానని ఇక పసుపు కండువా కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు కొలుసు పార్థసారథి.