వైసీపీ నాలుగో జాబితా విడుదల
ప్రకటించిన సీఎం జగన్ మోహన్ రెడ్డి
అమరావతి – ఏపీలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అధికారంలో ఉన్న వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటి వరకు మూడు జాబితాలను విడుదల చేసింది. తాజాగా నాలుగో విడత రిలీజ్ చేసింది.
నాలుగో జాబితాలో 8 అసెంబ్లీ స్థానాలతో పాటు ఒక లోక్ సభ నియోజకవర్గాలలో మార్పులు చేశారు వైసీపీ బాస్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. చిత్తూరు లోక్ సభ స్థానానికి ఇన్ ఛార్జ్ గా ఎంపీ నారాయణ స్వామిని ఎంపిక చేశారు.
జీడీ నెల్లూరు జిల్లా ఇన్ చార్జ్ గా రెడ్డప్పకు ఛాన్స్ ఇచ్చారు. శింగనమలకు ఎం. వీరాంజనేయులు, తిరువూరుకు స్వామిదాస్ , మడకశిరకు ఈర లక్కప్ప, కొవ్వూరుకు తలారి వెంకట్రావ్ ను నియమించింది.
కనిగిరి నుంచి దద్దాళ నారాయణ యాదవ్, గోపాలపురం నియోజకవర్గానికి హోం శాఖ మంత్రి తానేటి వనిత, నందికొట్కూరుకు డాక్టర్ సుధీర్ దారాను నియమించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
ఈసారి జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటాలని, వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు పార్టీ బాస్.