NEWSTELANGANA

శ్రీ‌దేవి మ‌ళ్లీ పుట్టిందా – ఆర్జీవీ

Share it with your family & friends

వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడి ట్వీట్

హైద‌రాబాద్ – వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడిగా గుర్తింపు పొందారు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయ‌న నిత్యం ఏదో ఒక అంశంతో ముందుకు వ‌స్తారు. సోష‌ల్ మీడియాను ఆయ‌న వాడుకున్నంత ఎవ‌రూ వాడుకోరు. ఆర్జీవీ ద‌ర్శ‌కుడే కాదు ఫిలాస‌ర్, ర‌చ‌యిత‌, భావుకుడు, అన్నీ. ఒక ర‌కంగా చెప్పాలంటే ప్ర‌తి అంశం ప‌ట్ల ఆయ‌న‌కు ప‌ట్టుంది. లేటెస్ట్ గా టెక్నాల‌జీలో వ‌చ్చిన మార్పుల గురించి కూడా మాట్లాడ‌తారు. వాటి గురించి విడ‌మ‌రిచి చెప్పేస్తారు.

ఆయ‌న‌కు దివంగ‌త దిగ్గ‌జ న‌టి శ్రీ‌దేవి అంటే చ‌చ్చేంత ఇష్టం. త‌న‌కు ఓ తీర‌ని కోరిక ఉంద‌ని, బ‌తికి ఉంటే ఆమెను పెళ్లి చేసుకుని ఉండే వాడినంటూ ఓ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు కూడా చేశారు. ఇదంతా ప‌క్క‌న పెడితే ప్ర‌స్తుతం ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ దెబ్బ‌కు యావ‌త్ ప్రపంచం మారిపోతోంది. శ‌ర‌వేగంగా అన్ని రంగాల‌లోకి పాకింది.

త‌మ‌కు న‌చ్చిన వారిని మ‌రింత అందంగా ఈ ఏఐ టూల్ తో త‌యారు చేయ‌వ‌చ్చు. ఇదే టూల్ ను ఉప‌యోగించి త‌ను ప్రాణ ప్ర‌దంగా ప్రేమించే శ్రీ‌దేవిని రూపొందించారు. దీనిని రామ్ గోపాల్ వ‌ర్మ ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. దీనికి అందంగా ఆర్టిఫిషియ‌ల్ శ్రీ‌దేవి అని పేరు కూడా పెట్టేశారు.